ఏపీలోని పెండింగ్లో ఉన్న 23 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో
ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఫొటో ఓటరు జాబితాలను ఈనెల 24న ప్రచురించాలని అధికారులకు
నోటిఫికేషన్ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 1ని ప్రామాణిక తేదీగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. శ్రీకాకుళం, కాకినాడ వంటి నగరాలతో సహా 19 పురపాలికల్లో కోర్టు కేసుల కారణంగా గత కొంతకాలంగా ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే.