
ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌లో యువతిపై పోలీసుల సామూహిక అత్యాచారం!
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో సెప్టెంబర్ 21న నలుగురు పోలీసులు కలిసి ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలయాల సందర్శనకు తీసుకెళ్తామని మభ్యపెట్టి, 22వ తేదీ సాయంత్రం ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదుతో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సబ్-ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్లను సస్పెండ్ చేసి, సీఆర్పీఎఫ్ సిబ్బందిపై చర్యలకు సిఫార్సు చేశారు. ఈ ఘాతుకం జరిగిన ఫామ్‌హౌస్ ఓ ఎమ్మెల్యేదని తేలింది.




