నందిగామ - Nandigama

నందిగామలో పారిశుద్ధ్య పనులు

నందిగామ పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పట్టణ శివారులోని మున్నేరు పెద్ద బ్రిడ్జి వద్ద మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ప్రత్యేక గ్యాంగ్ వర్క్ ఆదివారం నిర్వహించారు. పట్టణంలో పరిశుభ్రతను మెరుగుపరచడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా, కాలువలు, వీధులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా జరుగుతుందని కమిషనర్ తెలిపారు.

వీడియోలు


రాజన్న సిరిసిల్ల జిల్లా
ప్రియుడితో కలిసి మామిడి తోటలో ప్రేయసి సూసైడ్
Oct 11, 2026, 15:10 IST/

ప్రియుడితో కలిసి మామిడి తోటలో ప్రేయసి సూసైడ్

Oct 11, 2026, 15:10 IST
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా ధమ్నిఖేడా గ్రామంలోని మామిడి తోటలో యువతీ, యువకుడు చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందిన స్థితిలో కనిపించారు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులు ఛట్టా ఖేడాకు చెందిన అభయ్ కుమార్ (24), మహారామౌకు చెందిన ప్రీతి (20)గా గుర్తించారు. ప్రీతికి 10 నెలల క్రితమే వివాహం జరిగినప్పటికీ, అభయ్‌తో సంబంధాన్ని కొనసాగించినట్లు సమాచారం.