
పెనుగొలనులో పార్వతీదేవికి శ్రీ మహిషాసుర మర్ధినీదేవి అలంకారం
గంపలగూడెం మండలం పెనుగొలను శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాల్లో సోమవారం 9వ రోజు శ్రీ పార్వతి దేవికి శ్రీ మహిసాసుర మర్దనీ దేవి అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజలు, చండీ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.





































