ఆఫర్.. ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రెండెకరాల పొలం

52చూసినవారు
ఆఫర్.. ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రెండెకరాల పొలం
AP: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలో ఆసక్తికర ప్రకటన వెలువడింది. గ్రామస్థులంతా కలిసి తన భార్య రామలక్ష్మిని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పంచాయతీకి రెండెకరాల పొలం రాసిస్తానని గ్రామ ప్రముఖుడు కొప్పర్తి శ్రీరామ్మూర్తి ప్రకటించారు. గ్రామంలో తాగునీటి చెరువు సమస్యను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే గ్రామ పెద్దలు, ప్రజలతో సమావేశమై తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు శ్రీరామ్మూర్తి దంపతులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్