అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి: పవన్‌

73చూసినవారు
అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి: పవన్‌
AP: పీసీబీని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని భావించే వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ సూచించారు. పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే.. కాలుష్యాన్ని నియంత్రించేలా ముందుకు వెళ్లాలన్నారు. కానీ, పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి తీసుకురాకూడదని తెలిపారు. టీడీపీ MLA బొండా ఉమా చేసిన ఆరోపణలపై సోమవారం మరోసారి సమీక్షించారు. గత ప్రభుత్వంలో అలాంటి తప్పిదాలు చోటు చేసుకున్నాయని గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్