
చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్
ఉక్రెయిన్‌కు చెందిన డిమిట్రో హ్రున్స్కీ తన అసాధారణ శారీరక బలంతో ఇనుప పెనాన్ని చుట్టలా వంచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పెనం వెడల్పును 16.40 సెంటీమీటర్లకు (6.45 అంగుళాలు) తగ్గించాడు. ఈ విన్యాసానికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ వస్తువులను లాగడం, విభిన్న విన్యాసాలతో గుర్తింపు పొందిన డిమిట్రో ప్రతిభను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.




