
సెయింట్ ఆన్స్ హైస్కూల్ లో మెగా వైద్యశిబిరం
స్థానిక యడ్లపాడు సెయింట్ ఆన్స్ హైస్కూల్ లో మెగా వైద్యశిబిరం నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో గుంటూరు నైరా హాస్పిటల్స్ వారు, తార ఐ కేర్ వారు వైద్య సేవలు అందించి, ఉచితంగా విటమిన్ ట్యాబ్లెట్లు అందించారు. అలాగే విద్యార్థులకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్న ఉచిత ఓపీ కల్పిస్తామని నైరా హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జిలానీ తెలియజేశారు. తారా ఐ కేర్ హాస్పిటల్ వారు కంప్యూటర్ తో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కాగా క్యాంప్ సమన్వయ కర్తగా జి. దిలీప్ కుమార్ విధులు నిర్వహించారు.

































