
గురజాల నగర పంచాయతీ చైర్మన్‌గా నేలవల్లి బొల్లయ్య ప్రమాణస్వీకారం
పల్నాడు జిల్లా గురజాలలో సోమవారం నూతన నగర పంచాయతీ చైర్మన్‌గా నేలవల్లి బొల్లయ్య ప్రమాణస్వీకారం చేశారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిసైడింగ్ అధికారి ఆయనతో ప్రమాణం చేయించారు. వీరితో పాటు 23 మంది నూతన కౌన్సిలర్లు కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, యువ నాయకులు నిఖిల్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని చైర్మన్ నేలవల్లి బొల్లయ్య హామీ ఇచ్చారు.






























