పంచాయతీ ఎన్నికలు.. గుర్తుల కేటాయింపు

17చూసినవారు
పంచాయతీ ఎన్నికలు.. గుర్తుల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్‌ అభ్యర్థులకు 25, వార్డు సభ్యుల అభ్యర్థులకు 20 గుర్తులను రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించింది. మంచం, కత్తెర, బుట్ట, వంకాయ తదితర గుర్తులు ఈ జాబితాలో ఉన్నాయి. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే అదనపు గుర్తులను కేటాయించనున్నారు. ఓటర్లు ‘నోటా’కు ఓటు వేసే అవకాశం కూడా కల్పించారు. ఈ నెల 26, 29 తేదీలతో పాటు డిసెంబర్‌ 2న మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్‌ జరిగిన రోజే ఫలితాలను ప్రకటించనున్నారు.

సంబంధిత పోస్ట్