పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు సెలవు

10చూసినవారు
పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు సెలవు
AP: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాలల సెలవులపై అధికారులు స్పష్టతనిచ్చారు. ఈ నెల 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కేవలం ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన పాఠశాలలకు మాత్రమే ఆయా తేదీల్లో సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు. మిగిలిన పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని, ఈ సెలవులు ప్రైవేటు పాఠశాలలకు వర్తించవని వారు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్