ఏపీలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు 30 నుంచి 40 శాతం స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 13 వేలకు పైగా పంచాయతీలు ఉండగా, తమకు బలం ఉన్న ప్రాంతాల్లో పోటీ చేసి,
టీడీపీ బలంగా ఉన్న చోట్ల ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని
జనసేన శ్రేణులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ రాజ్ శాఖ కూడా పవన్ కళ్యాణ్ చేతిలో ఉండటంతో గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని
జనసేన నేతలు ఆశిస్తున్నారు. అయితే కూటమి ఐక్యత దెబ్బతినకుండా సీట్ల సర్దుబాటు చేయడం పవన్‌కు కీలకంగా మారింది.
జనసేన డిమాండ్లపై టీడీపీతో ఎలాంటి సమన్వయం కుదురుతుందో చూడాలి.