పార్టీ కేడర్ గట్టిగా పోరాటం చేసింది: జగన్

11చూసినవారు
పార్టీ కేడర్ గట్టిగా పోరాటం చేసింది: జగన్
AP: స్థానిక ఎన్నికల్లో పార్టీ కేడర్ గట్టిగా పోరాటం చేసిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అక్రమాలను ప్రజలంతా చూశారు. వారికి కూడా బాగా అర్థమైంది. 2024 ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఓటింగ్‌ శాతాలు పెరిగాయి. ఎన్నికల షెడ్యూలు దగ్గర నుంచి, ఓట్ల లెక్కింపు వరకూ ప్రతి దశలోనూ అరాచకాలు, అన్యాయాలు జరిగినా ఓటింగ్‌ శాతం పెరిగింది. సజావుగా ఎన్నికలు జరిగి ఉంటే.. వైసీపీకి అనుకూలంగా ఇంకా భారీగా ఓటింగ్‌ పర్సంటేజీ నమోదయ్యేది’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్