
పెట్రోల్తోపాటు వాటర్ బాటిళ్లు అమ్మనున్న ఐఓసీఎల్
దేశంలో అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 43 వేలకుపైగా రిటైల్ అవుట్లెట్ల ద్వారా నీటిని విక్రయించాలని సంస్థ ప్రతిపాదించింది. తొలుత 250 ఎంఎల్, 500 ఎంఎల్, ఒక లీటర్ బాటిళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. భవిష్యత్తులో ప్రీమియం, నేచురల్ మినరల్ వాటర్ ఉత్పత్తులను కూడా తీసుకురావాలని యోచిస్తోంది.




