
బొబ్బిలిలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాల ముగింపు
విజయనగరం జిల్లా బొబ్బిలి బైపాస్ రోడ్డులోని శ్రీ దాడితల్లి అమ్మవారి ఆలయంలో బుధవారం దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారికి 108 లీటర్ల పాలతో అభిషేకం, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అర్చకులు పిండిప్రోలు మణికుమార్ శర్మ నేతృత్వంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలను స్వీకరించి పునీతులయ్యారు.



































