చీపురుపల్లి - Cheepurupalli

వీడియోలు


నిర్మల్ జిల్లా
నిర్మల్ జిల్లా మస్కాపూర్‌లో ఘనంగా దుర్గామాత బోనాల ఊరేగింపు
Oct 19, 2026, 07:10 IST/ఖానాపూర్
ఖానాపూర్

నిర్మల్ జిల్లా మస్కాపూర్‌లో ఘనంగా దుర్గామాత బోనాల ఊరేగింపు

Oct 19, 2026, 07:10 IST
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలో సోమవారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను నిర్వహించారు. మహిళలు బోనాలను తలపైకెత్తుకొని డీజే పాటలు, దప్పుల చప్పుళ్లతో సందడిగా దుర్గా మాత మండపానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలను సమర్పించి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ వేడుకలో గ్రామ సర్పంచ్, భక్తులు, దుర్గా మాత కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. పండుగ వాతావరణంతో గ్రామం అంతా భక్తిభావంతో పులకించిపోయింది.