గజపతినగరం - Gajapathinagaram

వీడియోలు


నిర్మల్ జిల్లా
తెలంగాణ రేషన్ షాపుల్లో సబ్సిడీ ధరలకు నిత్యావసర సరుకులు!
Oct 22, 2026, 14:10 IST/

తెలంగాణ రేషన్ షాపుల్లో సబ్సిడీ ధరలకు నిత్యావసర సరుకులు!

Oct 22, 2026, 14:10 IST
తెలంగాణలో సామాన్యులపై భారాన్ని తగ్గించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడిని సబ్సిడీ ధరకే అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సరుకుల ధరలు, పరిమాణం, అమలు తీరుపై అధికారులు అందించే సమగ్ర నివేదిక ఆధారంగా ప్రభుత్వం త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.