కురుపాం - Kurupam

టీడీపీలోకి ఉల్లిభద్ర గ్రామానికి చెందిన 10 వైసీపీ కుటుంబాలు

టీడీపీలోకి ఉల్లిభద్ర గ్రామానికి చెందిన 10 వైసీపీ కుటుంబాలు

పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర గ్రామానికి చెందిన 10 వైసీపీ కుటుంబాలు బుధవారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరాయి. కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి సమక్షంలో వీరు టీడీపీ కండువా కప్పుకున్నారు. గరుగుబిల్లి మండల టీడీపీ అధ్యక్షుడు మరడాన నారాయణస్వామి, ఉమ్మడి విజయనగరం జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మరడాన తవిటినాయుడు చొరవతో ఈ చేరికలు జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్యే జగదీశ్వరి వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

వీడియోలు


నిర్మల్ జిల్లా