
గంట్యాడ జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన రంధి సరోజిని
విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గంట్యాడ మండలం జడ్పీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థిగా రంధి సరోజిని నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందని, గంట్యాడ మండలంలో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులు సమన్వయంతో పని చేసి మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.





































