
ఊరివేసుకుని మహిళ ఆత్మహత్య
బత్తిలి మండలంలోని దిమ్మిడిజోల గ్రామంలో కేవటి సరస్వతి (40) అనే మహిళ శుక్రవారం జీడి తోటలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త మరణం తర్వాత పుట్టింట్లో ఉంటున్న సరస్వతి ఘనసర గ్రామానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరి మధ్య నెలకొన్న మనస్పర్థల కారణంగానే ఆమె ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. గ్రామస్థుల సమాచారంతో బత్తిలి ఎస్సై రవీంద్ర కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఆసుపత్రికి తరలించారు.























