
గిరిజనులు సేకరించిన నరమామిడి బెరడును పరిశీలించిన అధికారులు
పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం పెద్దశాఖ డీఆర్ డిపో పరిధిలోని తెగలపాడు గ్రామంలో గిరిజనులు సేకరించిన నరమామిడి బెరడును సేల్స్ ఉమెన్ ఏ. మంగ, కాంట్రాక్ట్ సేల్స్‌మన్ కె. కృష్ణ బుధవారం పరిశీలించారు. బెరడును ఎక్కువగా సేకరించి, బాగా ఎండబెట్టి తేమలేని ప్రదేశాల్లో నిల్వ చేయాలని సూచించారు. ఎంత మొత్తంలోనైనా జీసీసీ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని గ్రామస్తులకు తెలిపారు.






























