Oct 10, 2026, 16:10 IST/నిర్మల్
నిర్మల్
బాసర గోదావరిలో మహిళ మృతదేహం లభ్యం, కేసు నమోదు
Oct 10, 2026, 16:10 IST
నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో శనివారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని డ్యూటీ సిబ్బంది గుర్తించారు. మృతురాలు బాసరకు చెందిన ఓనీ ఇందిరా (63)గా గుర్తించారు. ఆమె నిజామాబాద్లో కూతురు వద్ద ఉంటున్నారని, ఉదయం సోదరుడి ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరిందని తెలిసింది. మార్గమధ్యంలో గోదావరిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు జారిపడి మరణించినట్లు భావిస్తున్నారు. సోదరుడి ఫిర్యాదు మేరకు బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.