
రిజర్వేషన్ ప్రకటనతో ప్రేమ వివాహం చేసుకున్న టీడీపీ నేత
పార్వతీపురం జిల్లా సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో తనకు అవకాశం లేదని తాను ప్రేమించిన మంజీరను పెళ్లి చేసుకున్నారు మాజీ కౌన్సిలర్, టీడీపీ నేత హర్షవర్ధన్. ఎన్నికల బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. రిజర్వేషన్ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న ఆయన తన భార్యకు టీడీపీ టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశమైంది.

























