శృంగవరపుకోట - Srungavarapukota

మార్లపల్లిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే లలితకుమారి శ్రీకారం

లక్కవరపుకోట మండలం మార్లపల్లి గ్రామంలో సింహాద్రి అప్పన్న కళ్యాణ మండపం అభివృద్ధికి ఎస్‌డీఎఫ్‌ నిధుల నుంచి మంజూరైన రూ. 15 లక్షలతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాలును ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అభివృద్ధి పనులతో ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

వీడియోలు


నిర్మల్ జిల్లా
తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
Oct 14, 2026, 08:10 IST/

తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Oct 14, 2026, 08:10 IST
తెలంగాణను పెట్టుబడులకు, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా మార్చి, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధించి, దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10%కి పెంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. యువ, మహిళా పారిశ్రామికవేత్తలకు భూములు, అనుమతులు, విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.