
మంత్రి లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన 25 కుటుంబాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ ఉపాధ్యక్షుడు, దుగ్గిరాల మాజీ ఎంపీపీ వడ్డేశ్వరపు రజినీకాంత్ టీడీపీలో చేరారు. ఆయనతోపాటు 25 కుటుంబాలు మంత్రి లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు.




