AP: రాఖీ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక కానుకలు పంపించారు. 45 ఏళ్ల లోపు వితంతు, ఒంటరిగా ఉన్న 2,439 మంది మహిళలకు రాఖీ కానుకగా చీరలు పంపించారు. మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు,
జనసేన నేతలు మహిళలకు పవన్ కళ్యాణ్ పంపించిన కానుకలను అందజేశారు. పిఠాపురం టౌన్ స్టూవర్టుపేట, విరవవాడలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆడపడచులకు చీరలను పంపిణీ చేశారు.