చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

0చూసినవారు
చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పోటీ, సమన్వయంపై ఇద్దరు నేతలు చర్చించారు. కూటమి వంద శాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయం కోసం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి కమిటీల నియామకంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ప్రధానంగా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, మేయర్, మున్సిపల్ ఛైర్మన్, జెడ్పీ ఛైర్మన్‌ పదవులకు అభ్యర్థుల ఎంపికపై నేతలిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్