AP: కోనసీమ జిల్లాలో సంభవించిన గ్యాస్ బ్లోఅవుట్ కట్టడికి ఓఎన్జీసీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. గ్యాస్ పీడనాన్ని తగ్గించేందుకు నీటిని వినియోగిస్తూ ప్రత్యేక బృందాలతో పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద నివారణలో భాగంగా ఘటనా స్థలంలో విద్యుత్ పరికరాలను నిలిపివేశారు. ప్రజల భద్రత కోసం జాతీయ రహదారిని మూసివేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. మరోవైపు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.