AP: తిరుపతి జిల్లా, పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో
వైసీపీ కార్యకర్తలు పెట్రోల్ బాంబులతో దాడులకు పాల్పడ్డారని సమాచారం. ఈ ఘటన పోలీసుల సమక్షంలోనే జరగడం గమనార్హం. అలాగే, రైల్వేకోడూరులోని 4వ పోలింగ్ కేంద్రం వద్ద
టీడీపీ మరియు స్వతంత్ర అభ్యర్థి వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ ఏజెంట్‌ను బయటకు లాగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.