AP:
ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలోని ఎనిమిదో వార్డులో ఆదివారం నాడు నకిలీ బ్యాలెట్ పేపర్లతో ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు సదరు వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రత్యర్థి వర్గం, పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని ఓటింగ్ ప్రక్రియను కాసేపు అడ్డుకున్నారు. అనంతరం ఆర్డీవో, తహశీల్దార్లు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో ఉద్రిక్తత సద్దుమణిగి, పోలింగ్ తిరిగి కొనసాగింది.