AP: కాకినాడలోని ఓ బ్యాంకులో జరిగిన గోల్డ్ స్కామ్ కేసును పోలీసులు ఛేదించారు. గోల్డ్ లోన్ కోసం ఇచ్చిన ఆభరణాల దుర్వినియోగం కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. గోల్డ్ అప్రైజర్ నరవ సూరిబాబును వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను 44 గోల్డ్ లోన్ ఖాతాలకు చెందిన బంగారు ఆభరణాలను దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు రూ.1.45 కోట్ల విలువైన 1,020.53 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.