పోలీసులు టీడీపీ నేతల కొమ్ముకాశారు: వైసీపీ

16చూసినవారు
AP: మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో పాఠశాల మేనేజ్‌‌మెంట్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ వాళ్లకు పోలీసులు కొమ్ముకాశారని వైసీపీ ఆరోపించింది. శనివారం ఎక్స్ వేదికగా.. ‘పుల్లలచెరువు మండలం చాపలమడుగు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన పాఠశాల మేనేజ్‌‌మెంట్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమై.. టీడీపీ నేతలు పోలీసుల్ని ఉసిగొల్పారు. టీడీపీ నేతల ఆదేశాలతో స్కూల్ పరిసరాల నుంచి వైసీపీ నేతలను బలవంతంగా బయటికి పంపారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలే చేస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్