AP: గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపాలిటీ నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బీబీజాన్ నాసర్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దాంతో మున్సిపల్ కార్యాలయం లోపలికి వెళ్లడానికి పొన్నూరు
వైసీపీ ఇన్‌ఛార్జ్ అంబటి మురళి ప్రయత్నించారు. పోలీసులు అనుమతించకపోవడంతో అంబటి మురళి వాగ్వాదానికి దిగారు. దాంతో అంబటి మురళిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.