AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుంకలగుంటలో పంచాయితీ ఎన్నికల నామినేషన్ దాఖలు చేయకుండా
వైసీపీ సానుభూతిపరులకు సీఐ సతీష్ బెదిరింపులు దిగినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ముగ్గురు
వైసీపీ అభ్యర్థులను తన జీపులో ఎక్కించి సత్తెనపల్లి RDO ఆఫీసులో నామినేషన్స్ వేయిస్తానని చెప్పి తీసుకెళ్లి వారిని మార్గం మధ్యలో వదిలేసినట్లు పేర్కొన్నారు. ఆందోళన చేపట్టిన గ్రామస్థులపై పోలీసుల లాఠీ ఛార్జ్ చేశారన్నారు.