AP: ప్రకాశం జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ పరిశీలన కోసం వెళ్తున్న
వైసీపీ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి పత్రాలను
టీడీపీ కార్యకర్తలు లాక్కున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో పోలీసులు లాఠీఛార్జ్ చేయగా, ఒక
వైసీపీ కార్యకర్త కంటికి గాయమైంది. నిరసనగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి కార్యాలయం ముందు బైఠాయించారు. అక్కడ భారీగా
వైసీపీ కార్యకర్తలు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.