AP:
వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయనకు పులివెందుల పోలీసులు నోటీసులు ఇచ్చారు. అక్కడి పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా స్థానిక పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు. ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. వాట్సాప్ ద్వారా కూడా పంపినట్లు సమాచారం.