మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అరెస్టుకు పోలీసులు సిద్ధం

12చూసినవారు
మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అరెస్టుకు పోలీసులు సిద్ధం
AP: ఈ నెల 25న పోలీసులను పరుష పదజాలంతో దూషించిన రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆయనపై నమోదైన కేసు నేపథ్యంలో అరెస్టు కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పలు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గతంలో కూడా పలుమార్లు పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల వేళ రెచ్చగొట్టేలా మాట్లాడటంపై జిల్లా పోలీస్ శాఖ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా పరిగణనలోకి తీసుకుంది.

సంబంధిత పోస్ట్