మాజీ మంత్రి శైలజానాథ్‌ను అడ్డుకున్న పోలీసులు (వీడియో)

1చూసినవారు
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం టీడీపీ  నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని, పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్ చేస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ ఆఫీస్‌కు శైలజానాథ్ బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, శైలజానాథ్ మధ్య వాగ్వాదం జరిగింది.

సంబంధిత పోస్ట్