AP: శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి నగర కార్పొరేషన్లతో పాటు రాష్ట్రంలోని మరో 19 మున్సిపాలిటీలలో గురువారం పోలింగ్ ప్రక్రియ మొదలైంది. నాలుగు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 1,224 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 11,44,530 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మేయర్ పదవులకు 36 మంది, 257 కార్పొరేటర్ స్థానాలకు 911 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే శ్రీకాకుళంలో ఒక డివిజన్ ఎన్నిక నిలిచిపోగా, మరో రెండు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి.