ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ
ఎన్నికలు, మలి విడత మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రారంభమైంది. మొత్తం 3,240 గ్రామ పంచాయతీలతో పాటు 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఓటింగ్ కొనసాగుతోంది. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లలోనూ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.