నేడే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

13చూసినవారు
నేడే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
AP: ఇవాళ ఉదయం 7 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాల్లో 2,051 ఏకగ్రీవం కాగా, మిగిలిన 7,767 స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే 659 జడ్పీటీసీ స్థానాల్లో 77 ఏకగ్రీవం కాగా, 582 స్థానాలకు 2,169 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, తుఫాన్ ప్రభావంతో ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో పోలింగ్‌ను అధికారులు వాయిదా వేశారు. పోలింగ్ సజావుగా సాగేందుకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్