ఏపీలో ఆదివారం మున్సిపల్
ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఈ ఎన్నికలను బ్యాలెట్ పేపర్‌తో నిర్వహించనున్నారు. కాబట్టి ఓటర్లు జాగ్రతగా వ్యవహరించాలి. ఓటర్లు బ్యాలెట్ పేపర్‌లో తమకు నచ్చిన అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో స్వస్తిక్ ముద్ర వేయాలి. ఆ తర్వాత పేపర్‌ను నిలువుగా, ఆపై అడ్డంగా మడతపెట్టి బ్యాలెట్ బాక్సులో వేయాలి. అలా కాకుండా నేరుగా అడ్డంగా మడతపెడితే ఇంక్ మరొక అభ్యర్థి గుర్తుపై పడే అవకాశం ఉంది. దీనివల్ల ఓటు చెల్లదు (ఇన్‌వాలిడ్).