ప్రయాణాలు వాయిదా వేసుకోండి: వాతావరణ శాఖ

1చూసినవారు
ప్రయాణాలు వాయిదా వేసుకోండి: వాతావరణ శాఖ
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నాబ్' తుఫాను తీవ్ర రూపం దాల్చుతోంది. అక్టోబర్ 28 ఉదయం బాపట్ల - విశాఖపట్నం మధ్య ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 115 నుండి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అక్టోబర్ 26 నుండి 29 వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. తీర ప్రాంతాలకు వెళ్లవద్దని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు కఠిన నిబంధనలు విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్