AP: తిరువూరులోని శ్రీవాహిని ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తీవ్ర విద్యుత్ అంతరాయం నెలకొంది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. దీనిపై కౌంటింగ్ ఏజెంట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.