అద్దంకి - Addanki

విద్యుత్ ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి సమీక్ష

విద్యుత్ ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి సమీక్ష

విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం సమీక్ష నిర్వహించారు. బాపట్ల మండలంలో విద్యుత్ వైర్ తగిలి తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నర్సీపట్నం నాతవరంలో విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళల మృతిపై కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయాలపాలైన నాగరాజుకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. రెండు ప్రమాద ఘటనలకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వీడియోలు


మంచిర్యాల జిల్లా
గణేష్ నిమజ్జనం సందర్బంగా ప్రత్యేక పూజలు చేసిన ఫ్రేమ్ సాగర్
Sep 25, 2026, 16:09 IST/మంచిర్యాల
మంచిర్యాల

గణేష్ నిమజ్జనం సందర్బంగా ప్రత్యేక పూజలు చేసిన ఫ్రేమ్ సాగర్

Sep 25, 2026, 16:09 IST
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ స్వామి ఆలయం, లక్ష్మి నారాయణ ఆలయాల్లో గణనాథుడిని శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గణపతి నిమజ్జనం సందర్భంగా భక్తులు, యువత, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఎగ్గడి భాస్కర్, మేయర్ మధుకర్, కార్పొరేటర్లు తూముల నరేష్, పూదరి తిరుపతి, సల్ల మహేష్, గుండ సుధాకర్ పాల్గొన్నారు.