
గ్రానైట్ లో ప్రమాదం: వ్యక్తి మృతిపై విచారణ
చీమకుర్తి మండలంలోని ఓ గ్రానైట్ గనిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై గనులు భద్రత ఉపసంచాలకులు శివశంకర్, భద్రత మెకానికల్ ఉపసంచాలకులు కౌశిక్ సోమవారం సాయంత్రం విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, తుది నివేదికను అధికారులకు అందజేస్తామని వారు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.













