దర్శి - Darsi

దొనకొండ: మోటార్ సైకిల్ దొంగలు అరెస్టు

దొనకొండ: మోటార్ సైకిల్ దొంగలు అరెస్టు

మోటార్ సైకిల్ చోరీకి పాల్పడిన ముగ్గురిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ లక్కా కుల రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం దొనకొండలో స్థానికంగా గత ఏడాది నుండి నివాసముంటున్న వడ్డే సైదాబాబు జూలై 21 న రాత్రివేళ ఇంటిముందు పెట్టిన తన సీటీ 100 మోటార్ సైకిల్ (ఏపీ07 డిఎన్3752) చోరీకి గురైనట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ తమ సిబ్బందితో విచారణ చేపట్టి కొనకనమిట్ల మండలం ఉమ్మడి వెలిగండ్ల గ్రామానికి చెందిన పి. రమేష్, ఈ. వంశీ, దొనకొండ మండలం ఆరవల్లిపాడు గ్రామానికి చెందిన పి. శివయ్యలను ముద్దాయిలుగా గుర్తించి అరెస్టు చేశారు.

వీడియోలు


మంచిర్యాల జిల్లా
Top 10 viral news 🔥
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!
Sep 30, 2026, 17:09 IST/

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!

Sep 30, 2026, 17:09 IST
దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) పెంపుపై చర్చలు ఊపందుకున్నాయి. ఉద్యోగ సంఘాలు బోనస్ లెక్కింపు సీలింగ్‌ను రూ.7,000 నుండి రూ.21,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగులకు రూ.20,724 వరకు అదనంగా లభించే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, కొన్ని విభాగాల్లో రోజులు తగ్గించి బోనస్ ఇవ్వడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.