
గిద్దలూరు హైస్కూల్ ప్లస్ లో షేక్ నాయాబ్ రసూల్ ఎస్ఎంసి చైర్మన్ గా ఎన్నిక
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని హైస్కూల్ ప్లస్ లో మంగళవారం పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసి) ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో షేక్ నాయాబ్ రసూల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఎన్నికల పరిశీలకులుగా డాక్టర్ మొర్రి పిచ్చయ్య హాజరై ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. మొత్తం 15 మంది సభ్యులను ఎన్నుకోగా, చల్లా జ్యోత్స్న వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సిద్ధేశ్వర శర్మ ఈ వివరాలను వెల్లడించారు.





































