గిద్దలూరు పట్టణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిఐలు రామకోటయ్య, సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాచర్ల గేటు సెంటర్లో మానవహారం చేసి, విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని, పోలీసుల త్యాగాలను గుర్తించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సిఐలు సూచించారు.