Sep 22, 2026, 15:09 IST/
పెట్రోల్ బంక్‌లో ట్రాక్టర్‌తో వ్యక్తిని ఢీకొట్టే యత్నం.. నిందితుడు అరెస్ట్
Sep 22, 2026, 15:09 IST
రాజస్థాన్‌లో జైపూర్ రూరల్ పరిధిలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద బైక్‌కు పెట్రోల్ పోయించుకుంటున్న సురేష్ అనే వ్యక్తిపై ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేందుకు యత్నించిన ఘటన కలకలం రేపింది. సురేష్ సమయస్ఫూర్తితో పరుగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. నిందితుడు ట్రాక్టర్‌తో బైక్‌ను పలుమార్లు తొక్కించి ధ్వంసం చేశాడు. ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక వివాదమే ఈ దాడికి కారణమని పోలీసులు తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడు షైతాన్ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.